తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నారు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు. తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకే ప్రారంభమైన నేపథ్యంలో జూబ్లీహిల్స్లో తన సతీమణితో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన భార్య ప్రణితతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.