సాధారణంగా చేప నీటి నుంచి బయటకు వచ్చి ఊపిరి ఆడక గిలగిల్లాడుతుంది. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ చేప చెరువులో ఈత కొడుతున్న బాలుడి గొంతులోకి అనూహ్యంగా దూరింది. అనుకోని ప్రమాదంతో చేప గొంతుకు అడ్డంగా ఇరుక్కోవడంతో ఆ బాలుడు ఊపిరి ఆడక విలవిల్లాడాడు.