కట్టుకున్న భర్తే తన భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.. ఇదేదో సినిమా కథ అనుకుంటున్నారా..? కానే కాదు..ఇలాంటి అరుదైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. సునీల్, కుష్బూ జంటకు మే 17న పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం ఖుష్బూ తన అత్తవారికింటి మారింది. తొమ్మిది రోజుల పాటు అక్కడే తన అత్తమామలతో గడిపింది. ఆ తర్వాత పెళ్లి అనంతర ఆచారంలో భాగంగా ఆమె తన పుట్టింటికి వచ్చింది. కానీ, తిరిగి తన భర్త వద్దకు వెళ్లడానికి బదులు ఖుష్బూ అదృశ్యమైంది. కానీ, ఒంటరిగా కాదు, తన ప్రియుడితో కలిసి పారిపోయినట్టుగా తెలిసింది.