ఈ పోలీసులకు ఇప్పుడు తెలిసొచ్చిందా..?

ఈ పోలీసులకు ఇప్పుడు తెలిసొచ్చిందా..? చిత్తూరు జిల్లాలో ఇప్పుడు స్మగ్లింగ్ కార్యక్రమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్మగ్లింగ్ తీరు సినిమా సీన్ల ను తలపిస్తున్నాయి. గతంలో ఎర్రచందనం దుంగలను పాల వ్యాన్లలో తరలించినట్లే, ఇప్పుడు మద్యం సీసాలను స్మగ్లర్లు అక్రమ రవాణా చేస్తున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్ర బంగారం మిల్క్ ట్యాంకర్లలో ఎలా తరలి పోయిందో పుష్ప సినిమాలో సీన్లు కళ్ళకు కట్టినట్లు చూపిస్తే, ఇప్పుడు చిత్తూరులో అదే తరహా లిక్కర్ స్మగ్లింగ్‌ను పోలీసులు గుర్తించారు.