పోలీస్‌స్టేషన్‌లో మంటలు..కళ్లముందే కాలిబూడిదైన కార్లు, బైకులు..! ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంభాల్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగ తెగపడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక కార్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.