వరదలో చిక్కుకున్న 18 మంది -- వరద ఉధృతికి ఏడుగురి గల్లంతు -- కొనసాగుతున్న సహాయక చర్యలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలో వరద ప్రవాహంలొ ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చిక్కుకున్నారు. వరద ప్రవాహంలో ఏడుగురు కొట్టుకుపోయారు. దీంతో వాళ్లను కాపాడడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.