రీల్ పిచ్చి ముగ్గురు యువకుల ప్రాణం తీసింది. రీల్స్ చేస్తుండగా స్కార్పియో కారు పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వాస్నా బ్యారేజీకి కొద్ది దూరంలో యష్ భంకోడియా కారు నడిపాడు. ఆ తర్వాత కారును యష్ సోలంకికి నడపమని ఇచ్చాడు. క్రిష్ డేవ్ కూడా కారులో కూర్చున్నాడు. ముగ్గురు స్నేహితులు యు-టర్న్ తీసుకునే క్రమంలో కారును వెనక్కి తీసుకువస్తున్నారు. కానీ ఏదో కారణం చేత కారు మలుపు తిరగడానికి బదులుగా ఎదురుగా ఉన్న కాలువలోకి కారు నేరుగా దూసుకెళ్లింది.