అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. వడగళ్ల వర్షం కారణంగా ఇండిగో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని శ్రీనగర్‌లో ల్యాండ్ చేశారు. విమానంలో 200 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వడగళ్ల వర్షం దెబ్బకు విమానం ముందు భాగం ధ్వంసమైంది.