అల్లూరి ఏజెన్సీలోని మారుముల ప్రాంతాల్లోనూ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మావొయిస్టు ప్రాబల్య ప్రాంతాలు కావడంతో చాలాచోట్లా ఇన్నాళ్ళూ భయంతో బిక్కుబిక్కుమన్న ఆ గిరిజనులు... ఇప్పుడు స్వేచ్ఛగా జెండా పండుగలో పాల్గొన్నారు. మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా అంటూ ఆ గిరిజన బాలలు ముచ్చటగా దేశభక్తి గీతాలను ఆలపించారు. జై హింద్ అంటూ జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టారు. చాక్లెట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తులంతా వాళ్లకు తోడయ్యారు.