ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారికి జనవరి నుంచి పెంచిన పెన్షన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రజల నుంచి దరఖాస్తుల రూపంలో అన్ని వివరాలు అడుగుతున్నారు కానీ బ్యాంక్ వివరాలు అడగడం లేదని అన్నారు. బ్యాంక్ డిటైల్స్ పేరుతో మరికొద్ది రోజులు కాలయాపన చేస్తారని అనుమానం కలుగుతోందని అన్నారు.