రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట్లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 7 అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి బలవన్మరణం పాల్పడ్డాడు. హుటాహుటిన సంఘటన స్థలానికి నార్సింగీ పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.