మద్యం సేవించిన ఆటో డ్రైవర్ ఆన్సర్‌తో పోలీసుల షాక్..!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులకు ప్రతిరోజూ వింత ఘటనలు ఎదురవుతుంటాయి. ఎలాంటి పేపర్లు లేకుండా బుకాయించే వాళ్లు కొందరైతే.. సిగ్నల్స్ జంప్ చేసి పట్టుబడే వాళ్లు మరి కొందరు. ఇదిలా ఉంటే, తాగి వాహనాలు నడిపి దొరికిపోయేవారు ఇంకో రకం. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తనిఖీలు నిర్వహించే సమయంలో అడ్డంగా దొరికిపోయాడు. తప్పు కదా అని అడిగితే, విచిత్రమైన కారణాలు చెబుతూ బుకాయించాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.