అవార్డులు, జ్ఞాపికలు తయారు చేసే ఆ గ్రామానికే అరుదైన అవార్డు.. నంది అవార్డులకు రూపం దిద్దిన ఆ చేతులతో జాతీయస్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా అవార్డు అందుకోబోతున్న పెంబర్తి గ్రామం. తెలంగాణ రాష్ట్రం లో రెండు ఉత్తమ పర్యాటక గ్రామాలు అవార్డులకు ఎంపిక. బెస్ట్ టూరిజం కాంపిటీషన్ -2023 అవార్డుల కోసం దేశ వ్యాప్తంగా 796 గ్రామాలు దరఖాస్తులు చేసుకున్నాయి.. ఈ క్రమంలో జూన్ 6వ తేదీన పెంబర్తి గ్రామాన్ని సందర్శించిన కేంద్ర బృందాలు పెంబర్తి గ్రామాన్ని అవార్డుకు ఎంపిక చేశారు.. ప్రతిఏటా ఈ గ్రామాన్ని 25 వేలమంది సందర్శిస్తున్నట్లు గుర్తించారు...