టెంపుల్ సిటీలో చెడ్డీ గ్యాంగ్.. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మళ్ళీ చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. హైవే పక్కనే ఉన్న కొత్తపాళెం లే అవుట్‌లోని ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించిన దొంగలు మొత్తం దోచుకెళ్లారు. సత్యనారాయణ రెడ్డి ఇంట్లోకి భారీగా చోరీకి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.