విజయవాడలో మహశ్ అభిమాని ఓవరాక్షన్ చేశాడు. ఖలేజా సినిమా రీ రిలిజ్ సందర్భంగా ఏకంగా నిజమైన పామును తీసుకొచ్చాడు. తొలుత అది బొమ్మ పాము ఏమో అని మిగిలిన ప్రేక్షకులు భావించారు. కానీ అది తర్వాత చేతిలో కదులుతూ ఉండటంతో నిజమైన పాము అని తెలుసుకుని భయబ్రాంతులకు గురయ్యారు.