శ్రీశైల దేవస్థానానికి తిరుప‌తి వాసి కారు విరాళం .. ఖరీదు ఎంతంటే..!

శ్రీశైల దేవస్ధానానికి తిరుప‌తి వాసి ఉద‌య్ కుమార్ రెడ్డి సోమ‌వారం ఎంజీ మోటార్స్ కారు ఆస్ట‌ర్‌ ను విరాళంగా అంద‌జేశారు. దీని విలువ రూ.15 ల‌క్ష‌లు. శ్రీశైలం ఈవో పెద్దిరాజుకు ఉద‌య్ కుమార్ రెడ్డి ఈ కారును అంద‌జేశారు. సోమ‌వారం ఉద‌యం గంగాధ‌ర మండ‌పం వ‌ద్ద వేద పండితులు పూజ‌లు చేశారు.