సముద్రంలో మునిగి ఇటలీ దేశస్థుడు మృతి..

16 మంది ఇటలీ దేశస్తులు.. వారంతా ఇటలీ నుంచి ఇండియాకు టూర్ వచ్చారు.. దీనిలో భాగంగా అన్నీ పర్యాట ప్రదేశాలను చుట్టేస్తూ.. వైజాగ్‌లో దిగారు.. ఈ క్రమంలోనే.. యూరాడ బీచ్‌కు సరదాగా వెళ్లారు. ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.. ఈ క్రమంలోనే.. నీటిలో దిగి సరదాగా ఆడుకుంటూ కనిపించారు.. అయితే.. వాళ్ల తీరు చూసి.. సముద్రం చెలగాటం వద్దు.. అలలను నమ్మొద్దు.. ముంచేస్తాయ్.. అంటూ మెరైన్ సిబ్బంది, జీవీఎంసీ లైఫ్ గాడ్స్ హెచ్చరించారు..