ఊరుకుల పరుగుల జీవితం యాంత్రికంగా మారిపోయింది. మనం మనది నుంచి నేను నాది అనే స్టేజ్ కు చేరుకున్నారు. ఎంతగా మరిపోయరంటే.. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా రోడ్డుమీద తమ సమీపంలో ఎవరైనా పడిపోతే చూస్తూ వెళ్ళిపోతున్నారు. లేదా రీల్స్ తీసి సోషల్ మీడియాలో తీసే పనిలో ఉంటున్నారు. మరి ఓ ఊరపిచ్చుక తన తోటి పిచ్చుక ప్రాణాల కోసం పోరాడుతూ విలవిలలాడుతుంటే చూడలేకపోయింది. శ్వాస అందక కొన ఊపిరితో పడి ఉన్న పిచ్చుక కు ప్రాణం పోయాలని ఆరాటపడింది. అంతేకాదు తోటి ప్రాణిని బతికించడం కోసం తన వంతు ప్రయత్నాలు చేసింది.