అభ్యర్థుల ప్రకటనపై టిడిపిలో తారాస్థాయికి చేరిన విభేదాలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టిడిపి టికెట్ను మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, టిడిపి నేత డాక్టర్ సోమనాథ్ ఆశిస్తున్నారు తనకే టికెట్ అని ఇద్దరు ప్రచారం చేసుకుంటున్నారు ప్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎమ్మిగనూరు ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే జయ నాగేష్ ఉంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఎంజీ బ్రదర్స్ కుటుంబానికి చెందిన మాచాని సోమనాథ్ రంగంలోకి దిగారు. వేరే జిల్లాలో డాక్టర్ గా స్థిరపడిన సోమనాథ్ ఎమ్మిగనూరులో ప్రచారం చేయడం సంచలనంగా మారింది. సైకిల్ యాత్రలు కూడా చేశారు. పార్టీ అండదండలు లేకుండా ఆదేశాలు లేకుండా ప్రచారం చేస్తారా అనేది చర్చ అయింది.