అర్ధరాత్రి గిరిజన మహిళకు పురిటినొప్పులు.. రవాణాలేక అష్టకష్టాలు! చివరికి

శ్రీకాకుళo జిల్లాలో బుధవారం అర్థరాత్రి ఇలాగే ఓ గర్భిణికి 108 అంబులెన్స్ లోనే ప్రసవం అయింది. జిల్లాలోని మందస మండలం కుడుమా సాయి గ్రామానికి చెందిన సవర విజయలక్ష్మి (21) అనే గిరిజన మహిళకు బుధవారం అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబసభ్యులు 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా.. కొంత సమయానికి పలాస నుండి 108 వాహనం గ్రామానికి చేరుకుంది. విజయ లక్ష్మిని పికప్ చేసుకొని, పలాస ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమెకు ప్రసవం అయ్యింది.