ఆ గిరిపుత్రుల కోసం సాహసం.. శభాష్ డాక్టర్..!

ఛత్తీస్‌గడ్ - తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో గుట్టపై దాదాపు 50 ఏళ్ల క్రితం వెలిసిన ఓ గిరిజన గ్రామం. ప్రస్తుతం మారుమూల పల్లె విషజ్వరాలతో మంచం పట్టింది. ఆ గిరిపుత్రుల ప్రాణాలు కాపాడడం ములుగు జిల్లా వైద్య సిబ్బంది ఎంతటి సాహసానికి ఒడిగట్టారో తెలుసా..? వారి ప్రాణాలు ఫణంగా పెట్టారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులు దాటుకుంటూ వెళ్లి గుట్టలెక్కి ఆ గిరిపుత్రులకు గోలి బిల్లలు అందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య బృందం చేసిన సాహసాన్ని చూసిన ప్రతి ఒక్కరూ శబ్భాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.