ఇటీవల కాలంలో అమ్మాయిలు రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అయితే తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని లక్నో షాహీద్ పాత్ లో జరిగింది. 21ఏళ్ల ఓ యువతి రాత్రిపూట సమయంలో తన స్కూటీపై ఇంటికి వెళుతుండగా వెనక నుంచి ఆమెను ఓ బైకర్ అసభ్యంగా తాకి వెళ్లిపోయాడు.