కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన కామెంట్స్

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనలో 9మంది భక్తులు మృతి చెందడం తనను కలచివేసిందని అన్నారు. ఈ దుర్ఘటనకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని.. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.