ఇది బావి కాదు.. పూల బుట్ట..! ఈ ఇంటికి సిరుల పంట..!! కారణం ఏమిటంటే..

మనిషన్న తరువాత కాస్తంత కళా పోషణ ఉండాలి.. అని ఓ సిని నటుడు అన్నట్లుగా.. వైరా మున్సిపాలిటీలో నివశిస్తున్న పర్ష మల్లయ్య కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఉన్న చేద బావికి గంగమ్మ తల్లిగా పూజించి ఆకర్షణీయంగా పూల బుట్టలా తీర్చిదిద్ది తమ బావిపై తమకున్న మమకారాన్ని చాటుకు న్నారు..