సంబరాలు చేసుకున్న తాగుబోతులు

సంబరాలు చేసుకున్న తాగుబోతులు మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తరుణ్ చేసిన పోరాటం ఫలించింది. కూలింగ్ బీర్ల కొరతతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. మండు టెండల్లో మద్య ప్రియుల బాదలు తీర్చాలంటూ మంచిర్యాల ఐబీ నుండి మంచిర్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి ఎక్సైజ్ శాఖకు తన గోడు వెళ్లబోసుకున్నాడు మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంఘం అధ్యక్షుడు.. దీంతో అతని పోరాటం 24 గంటల్లోనే ఫలించింది.