IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో మెరిసిన తెలుగు కుర్రోడు!

పట్టుదల, దృఢ సంకల్పం ఉండాలే గాని సాధించలేనిదంటూ ఏమి ఉండదు. కార్యసాధనలో ఒక్కోసారి ఓటమి ఎదురయినా నిరాశపడకూడదు. అవి తాత్కాలికమే అనుకుని ముందడుగు వేస్తూ పోవాలి. అనుకున్నది సాధించెంత వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉండాలి. అప్పుడు తప్పకుండా ఏదో ఒకరోజు విజయం మన సొంతం అయి తీరుతుంది. అనుకున్నది తప్పక నెరవేరుతుందని నిరూపించాడు సిక్కోలు జిల్లాకు చెందిన బాన్న వెంకటేష్. 2024 సివిల్స్ ఫలితాల్లో ఏకంగా ఆల్ ఇండియా లెవల్ లో 15వ ర్యాంక్ సాధించి తెలుగోడి సత్తా చాటాడు..