సంతలో కూరగాయలు, రోజువారీ సామాన్లే దొరుకుతాయా? అంతకుమించి ఏమీ దొరకవా? అనే రీతిలో తణుకు సంత తయారైంది. ఏకంగా మద్యం బాటిల్స్ సంతలోకనిపిస్తున్నాయి. ఇలా మద్యాన్ని సంతలో సరుకులా అమ్మేస్తున్నాడు ఓ యువకుడు. రంగురంగుల బాటిల్స్ చూసిన వారికి తొలుత ఇదేంటో అర్ధం కాలేదు. కానీ ఇవన్నీ మద్యం బాటిల్సే అని అర్థమైనవారు షాక్ అయ్యారు. సంతలో ఇలా బహిరంగంగా అమ్మకాలు చేపట్టడంతో కొందరు యువకులు వీడియోలు తీశారు.