వామ్మో సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం

బంగళాఖాతంలోని తూర్పు తీర ప్రాంతంలో అరుదైన చేపలు, తిమింగలాలు, డాల్ఫిన్లు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసింది. తీరం నుంచి సముద్రం లోపలకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇవి తరచూ కనిపిస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి కూడా.. అయితే ఇటీవల ఇవి సముద్ర కెరటాలతో పాటు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి.