దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ప్రమాదం..

కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవంలో విషాదం చోటు చేసుకుంది. ఉత్సవాన్ని చూసేందుకు వచ్చి కొంతమంది స్థానికులు సమీపంలోని చెట్లు ఎక్కారు. ఎక్కువ మంది ఎక్కడంతో ఆ బరువుకు చెట్టు కొమ్మ విరిగి ఇద్దరు మృతి చెందారు. మృతులు ఆస్పరికి చెందిన గణేష్‌, కమ్మరచేడుకు చెందిన రామాంజనేయులుగా గుర్తించారు పోలీసులు.