మాన్‌సూన్ కాస్త ముందే ముదలైంది. రుతుపవనాలు తెలుగురాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు, పశుపక్ష్యాదులకు వర్షాలతో కాస్త ఉపశమనం కలిగించినా ఇబ్బందులూ తప్పడంలేదు. వర్షాలకు పుట్టల్లోనుంచి పాములు బయటకు వస్తున్నాయి. ఇళ్లలో, దుకాణాల్లో, వాహనాల్లో ఎక్కడపడితే అక్కడ చేరుతున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవలే కోళ్లకు మేత వేద్దామని వెళ్లిన వ్యక్తిని త్రాచుపాము బుసలు కొడుతూ పరుగులు పెట్టించింది. తాజాగా నిర్మల్ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది.