ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టిన బిర్యానీ.. ఓపెన్ చేయగా బొద్దింక ముక్కలు ప్రత్యక్షం..!

ఖమ్మం వైరా రోడ్డులో ఉన్న కోణార్క్ రెస్టారెంట్ నుండి శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మేడిశెట్టి కృష్ణ అనే కస్టమర్ స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు... జుమాటో ద్వారా స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్న కృష్ణ కుటుంబ సభ్యులు బిర్యానీ వడ్డించుకుని తినేందుకు సిద్ధం అయ్యారు. కొంచం తిన్న తర్వాత మళ్ళీ వడ్డించుకునే సమయంలో బొద్దింక పురుగు కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు.