చిత్తూరు జిల్లాలో వింత ఆచారం.. ఒకరోజు ఊరు బయట గడిపిన గ్రామస్థులు

గ్రామానికి ఏ కీడు జరగకుండా, గ్రామమంతా ఐక్యంగా ఉండాలని ఆనవాయితీగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాయి. గుడిపల్లి మండలం గుడి కొత్తూరు, వేపమాను కొత్తూరు గ్రామాలు ఈ ఆచారాన్ని పాటించాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వలస సంప్రదాయాన్ని పాటిస్తున్న గ్రామస్తులు పొద్దు పొడవక ముందే మూటా ముల్లి సర్దుకొని ఊరిని ఖాళీ చేశారు. దాదాపు 200 కు పైగా ఇళ్ళు ఉన్న ఈ రెండు గ్రామాల్లో వెయ్యి మంది దాకా జనాభా కూడా ఉండగా వింత ఆచారం నేటికీ పాటిస్తుండటం ఆసక్తిగా మారింది.