ప్రయాణికుల ప్రాణాలు బలి తీసుకున్న ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం..

వరంగల్-హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి NH 163 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగిఉన్న ఇసుక లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు..