లిక్కర్ బాటిల్స్ ధ్వంసం.... అది గుంటూరు శివారు ప్రాంతం...అక్కడంతా కోలాహలంగా ఉంది.... పోలీస్ సిబ్బంది ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. అక్కడ జరుగుతున్నా హాడావుడి స్తానికులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వస్తున్న పోలీసులంతా మద్యం బాటిల్స్ తీసుకొస్తున్నారు. వాటిని నేలపై వరుసగా పేర్చుతున్నారు. ఏంటా ఇదంతా అని స్థానికులు చూస్తుండిపోయారు.