తన కారుకు అడ్డొచ్చాడని వీరంగం చూపించిన ఎస్‌ఐ..!

తన కారుకు అడ్డొచ్చాడని వీరంగం చూపించిన ఎస్‌ఐ..! నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జూలై 28న ఓ ఎస్ ఐ వీరంగం సృష్టించాడు. రాత్రి సమయంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలోని యూటర్న్ వద్ద ద్విచక్ర వాహనదారుడిపై తన ప్రతాపం చూపించాడు వనపర్తి జిల్లా పానగల్ ఎస్సై కళ్యాణ్. తన కారుకు ద్విచక్ర వాహనదారుడు అడ్డు రావడంతో ఆవేశానికి లోనైనా ఎస్సై ఒక్కసారిగా రెచ్చిపోయాడు. వాహనంలో నుంచి దిగి విరుచుకుపడ్డాడు. పిడుగులు గుద్దుతూ అతనిపై దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మరోసారి దాడి చేశాడు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.