మరణించినా.. ప్రాణదాతగా నిలిచిన యువ డాక్టర్..!

తాను మరణిస్తే అవయవదానం చేసి పలువురు ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు, స్నేహితులకు చెప్పిన డాక్టర్ భూమికా రెడ్డి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్కగానొక్క కుమార్తెను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో కూడా డాక్టర్ భూమికా రెడ్డి తల్లిదండ్రులైన నందకుమార్ రెడ్డి, లోహిత దంపతులు తమ బిడ్డ కోరిక తీర్చాలనుకుని అవయవదానానికి అంగీకరించారు. అలా భూమికా రెడ్డి ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, కిడ్నీలను వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్న రోగులకు అవయవ దానం చేశారు.