ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం.. ఈడ్చి ఈడ్చి తన్నిన ఆడవాళ్లు

ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. బస్సులో ఉన్న అమ్మాయిలతో అసైభ్యంగా ప్రవర్తిస్తూ వారిపై దాడికి యత్నించాడు. దాంతో ఆ యువతులంతా కలిసి ఆ తాగుబోతుకు తగిన శాస్తి చేశారు. ఈ ఘటన సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుండి సిద్దిపేటకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సు, సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఆగినప్పుడు మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు బస్సులో ఎక్కాడు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి మీదుగా బస్సు నడుస్తున్న సమయంలో