కర్నూలు, డిసెంబర్11; కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుంటున్నారు. ఆ మహా శివుడికి ఇష్టమైన పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక, జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తుల తాకిడి పెరిగింది