మూడేళ్లకు ఒక్కసారే పెళ్లి ముహూర్తాలు.. వరుడికి తాళి కడుతున్న వధువు.. ఎక్కడో తెలుసా..

ఊరంతా పందిరి. ఇంటింటా పెళ్లి బాజాలు. మూడు రోజుల పాటు జరిగే పెళ్లి తంతు. ఒకే రోజు, ఒకే ముహూర్తానికి ఏకమైన 62 జంటలు. అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టడం ఎక్కడా ఉండేదే. కానీ ఇక్కడ మాత్రం ముందు అబ్బాయి.. అమ్మాయి మెడలో తాళి కడితే.. తర్వాత అమ్మాయి కూడా అబ్బాయి మెడలో తాళి కడుతుంది. ఈ వింతలు విశేషాలు ఎక్కడో కాదు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మత్స్యకార గ్రామం నువ్వులరేవు గ్రామంలోనిది. అబ్బో ఇలా చెబుతూ పోతే ఆ గ్రామంలో పెళ్లిల్లకు ఎన్నో ప్రత్యేకతలు.