దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన పుణ్య క్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం. దీనికి అనుబంధ ఆలయమైన పర్ణశాలలో భక్తులను ఆకట్టుకునే చారిత్రాత్మక ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. సీతమ్మ వనవాసం చేసిన చారిత్రాత్మక ఆనవాళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పర్ణశాల కుటీరం ఉంది.