సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అవిశ్రాంత కృషి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారంటూ మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎం. వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో సంగీత నాటక అకాడమీ సౌత్ ఇండియా కల్చరల్ సెంటర్ కు ప్రారంభోత్సవం, భరత్ కళా మండపం ఆడిటోరియానికి పునాది రాయి వేశారు.