త్వరలోనే కొత్త రేషన్ కార్డులు

త్వరలోనే కొత్త రేషన్ కార్డులు తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల కోసం జనం ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డు అర్హత ఉండటంతో.. అవి లేకపోవడం వల్ల నిరుపేద కుటుంబాలకు పెద్ద ఆటంకంగా మారింది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.. ఈ క్రమంలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు.