జెర్రిపోతు వర్సెస్ కింగ్ కోబ్రా.. ఒక పాముది జీవన పోరాటం.. మరొక పాముది ఆకలికోసం ఆరాటం.. ఇలా రెండు పాముల మధ్య భీకర పోరాటం జరిగింది.. చివరకు కింగ్ కోబ్రా ముందు జెర్రిగుడ్డు తలవంచక తప్పలేదు. జెర్రిగుడ్డును అమాంతంగా మింగేసింది ఆ భారీ నాగు పాము.. మళ్లీ జెర్రిపోతును బయటకు కక్కి వెళ్లి పోయింది.. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట మల్లెపుట్టు ప్రాంతంలో చోటుచేసుకుంది..