మహబూబాబాద్ జిల్లాలో గ్రానైట్ లారీల బీభత్సం ప్రజలను హడలెత్తిపోయేలా చేస్తుంది. తాజాగా తొర్రూరులో మరో గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం (అక్టోబర్ 21) తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన లారీ డ్రైవర్ జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న బారీ గ్రానైట్ రాళ్లు రహదారిపై చెల్లాచెదరగా పడిపోయాయి. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెండు రోజుల క్రితం ఇదే తొర్రూర్ సమీపంలో మరో గ్రానైట్ లారీ గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన ఘటనలో 20 కి పైగా మూగజీవులు నుజ్జునుజ్జయ్యాయి.