అయినా వీడని నిర్లక్ష్యం.. ఈసారి ఒకే ట్రాక్‌పైకి ఏకంగా నాలుగు రైళ్లు!

గతేడాది జూన్‌లో ఒడిశాలోని బాలేశ్వర్ (బాలాసోర్)లో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం ఇప్పటికీ కళ్లముందు మెదులుతూనే ఉంది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టి పట్టాలపై చల్లాచెదురుగా పడిపోయింది. అనంతరం అదే ట్రాక్‌పైకి వచ్చిన యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ రైలు బోగీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 291 మంది మృతి చెందగా.. దాదాపు 1100 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాటి ఘోర ప్రమాదంలో మృత్యుఘోష ఇంకా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. ఈ ప్రమాదం కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఒడిశా ప్రభుత్వం తేల్చి, ముగ్గురు అధికారులను అరెస్ట్‌ చేసింది.