ఏపీలో ఇవాళ బిగ్ డే. ఇవాల్టి నుంచే పొలిటికల్ సమ్మర్ సీజన్ మొదలవుతోంది. సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు..ఇద్దరూ కూడా ఇవాల్టి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. అది కూడా సీమ నుంచే ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్లనున్నారు. ఇక ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు చంద్రబాబు.