విజయవాడ బాబాయ్ హోటల్ లో సందడి చేసిన చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్రమ్ చాలా డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీమ్. విజయవాడలోని బాబాయ్ హోటల్ కు వెళ్లారు. హీరో విక్రమ్, హీరోయిన్ మాళవిక మోహనన్ తో పాటు నిర్మాతలు కూడా ఉన్నారు. వీరిని చూడటానికి జనం ఎగబడ్డారు. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.