కుందనపు బొమ్మల మెరిసిన వర్షా బొల్లమ్మ.. ఎంత ముద్దుగా ఉందో..

తమిళ్ సినిమాలతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ.. విజయ్ సేతుపతి నటించిన 96 , అలాగే దళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాల్లో కనిపించింది ఈ చిన్నది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేసి ఆకట్టుకుంది. తమిళ్ , మలయాళ భాషల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో  ప్రేక్షకులకు దగ్గరైయింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది.