కాలు విగిరి బురదలో ఒంటరి ఏనుగు నరకయాతన.. 15గంటలు శ్రమించి కాపాడిన అధికారులు

చిత్తూరు జిల్లాలో ఓ ఒంటరి ఏనుగు బురదలో చిక్కుకొని నరకయాతన అనుభవించింది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి యాదమరి మండలం కమ్మపల్లి అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చిన ఒంటరి ఏనుగు దాహం తీర్చుకునే ప్రయత్నం చేసి కష్టాల్లో పడింది. విషయం తెలుసుకున్న అటవిశాఖ అధికారులు 15 గంటల పాటు శ్రమించి ఏనుగు క్షేమంగా బటయకు తెచ్చారు.