గిరిజనులతో ప్రత్యేకంగా సంభాషించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన సమాజ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సంభాషించారు.. ఈ క్రమంలోనే.. గిరిజనులు ప్రధాని మోదీతో మాట్లాడుతూ తమ మనసులోని మాటను బయటపెట్టారు. గిరిజన సంస్కృతిని అద్దం పట్టే సాంప్రదాయ శిరస్త్రాణం నెమలి పింఛాలతో కూడిన పగిడిని బహుమతిగా ఇవ్వాలనుకున్నామని.. కానీ భద్రతా కారణాల దృష్ట్యా దానిని లోపలికి అనుమతించలేదంటూ.. గిరిజనులు ప్రధానికి వివరించారు. దీంతో ప్రధాని వెంటనే స్పందించారు.